Personality In Detail!



ఎ.జి.కృష్ణమూర్తి.

చాలామంది ఉన్నత చదువు పూర్తి అయ్యాక ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని తమ జీవితంలో తమ కాళ్ళమీద స్థిరపడాలనుకుంటారు.
సర్వసాధారణంగా అందరూ ఇటువంటి ఆలోచనలే చేస్తారు.
ఎ.జి.కృష్ణమూర్తిగా పిలువబడే   అచ్యుతాని గోపాల కృష్ణమూర్తి గారు
1942, ఏప్రిల్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో
జన్మించాడు.
బాల్యం తెనాలి బాపట్లలో గడిచింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బి.ఏ హానర్స్ పట్టాపుచ్చుకున్నారు.
అనంతరం ఆయన మొదట బాపట్ల సబ్‌మెజిస్ట్రేట్ కోర్టులో స్టెనోగా ఉద్యోగంలో చేరారు.
1962లో మద్రాసు పోర్టు మ్యూజియంలో యూడీసీగా ఉద్యోగం చేసారు.
ఐదు సంవత్సరాల తిరక్కుండానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వతంత్ర ఆలోచనలు మెండుగా ఉన్న కృష్ణమూర్తిగారు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. అదే ఆలోచనతో
1972లో వ్యాపార ప్రకటనాసంస్థ అయిన శిల్పా అడ్వర్టైజింగ్ లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.
1976లో రిలయన్స్ సంస్థలకు ఆడ్వర్టైజింగ్ మేనేజరుగా చేరి, నాలుగు సంవత్సరాలు తిరక్కుండానే సొంత వ్యాపార ప్రకటనా సంస్థ ముద్రా కమ్యూనికేషన్స్ ను 1980, మార్చి 25న స్థాపించాడు.
‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన.
ఫ్రాంక్ సియాయిస్ తో కలసి చాలా కాలం పనిచేశారు.
ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన చెంతకు వెళ్ళేవారు.
దీనికి ప్రతిగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ
ధీరూభాయ్ అంబానీ కి సూచించారు ఈయన.
దాన్ని అంబానీ ఆమోదించారు.
ఆయన రూ. 35 వేల నగదు తోను ఒకే ఒక క్లయింట్‌ తోను వ్యాపార ప్రకటనా సంస్థ స్థాపించారు.

కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా భారతదేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. 1980లో ముద్ర వెలిసింది. ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్‌రంగంలో అడ్వర్టయింజింగ్ జీనియస్‌గా ఏజీకే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా విమల్ షోలు నిర్వహించి విమల్ విజయ పరంపరను కొనసాగించడంలో కృష్ణమూర్తిది అద్వితీయమైన పాత్ర. ‘ఐ లవ్ యూ రస్నా’ కూడా ఆయన సృష్టే.
కేవలం ఒక గుమస్తాగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారతదేశంలో ఎదురులేని ప్రకటనల రారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కృషి పట్టుదల వీటికి తోడు ఉన్నత శిఖరాలకు చేరాలనే సంకల్పం ఉంటే ఎవరైనా సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు కృష్ణమూర్తిగారు..
అందుకే ఆయన ఓ స్ఫూర్తి మంత్రం.
ఎప్పుడూ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నిరంతరం పరిశ్రమించే తత్వమే ఆయన్ను భారత దేశ ఎల్లలు దాటి తన కీర్తిని వ్యాపింప చేసింది.

ఆయన కేవలం వ్యాపార రంగం లోనే కాదు తన అనుభవాలను తన ఆలోచనలను భావితరాలకు అందించి వారిని కూడా విజయతీరాలకు చేర్చగలిగే అక్షరాలతో పుస్తకాలుగా రాసిన గొప్ప రచయిత ఆయన.

‘ధీరూభాయిజమ్’ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు.

‘ఎదురీత’ పేరుతో మరో పుస్తకం రాశారు.

‘ఇదండీ నా కథ’ అనేది ఏజీకే ఆత్మకథ.

అంచెలంచెలుగా ఎదుగుతూ యాడ్స్ రంగ దిగ్గజ వ్యక్తుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కృష్ణమూర్తి తెలుగు, ఆంగ్లంలో 15కి పైగా పుస్తకాలు రచించారు.
ఇతడు తన 73వ యేట ఫిబ్రవరి 5, 2016న హైదరాబాదులో మరణించాడు.
కలలు కనండి సాకారం చేసుకోండి అన్న కలాం గారి మాటలు ఏనాడో నిజం చేసిన మహనీయుడు కృష్ణమూర్తిగారు.
జీవితానికి కొత్త ఆలోచనలతో కొత్తబాటలు వేయాలనుకున్న వారికి ఆదర్శమైన వ్యక్తి కృష్ణ మూర్తి గారు
ఈయన తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం

situs slot gacorslot88