Personality In Detail!



కరణం మల్లేశ్వరి.

తెలుగువారి క్రీడా కీర్తికేతనాలలో కరణం మల్లేశ్వరి ఒకరు. 2000 సంవత్సరం సిడ్నీ ఒలంపిక్స్ లో యావత్ భారతదేశం తెలుగు నేల వైపు చూడడానికి కారకులైన క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి గారు.


ఈమె 1975 జూన్ 1 న  చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్రామములో పుట్టింది.
మల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసకు వెళ్ళడంతో అక్కడే స్థిరపడ్డారు.

మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్
గొప్ప ప్రతిభ చూపింది
అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు .
12 సంవత్సరాల వయసులోనే వెయిట్లిఫ్టింగ్ లోకి ప్రవేశించారు మల్లేశ్వరి గారు.
29 అంతర్జాతీయ పథకాలు సాధించారు.

* చైనా దేశం లోని గ్యాంగ్ ఝూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోతీల్లో 54 కిలోల విభాగంలో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చారు.
*1995 చైనాలో జరిగిన పోటల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు .
2000 సంవత్సరంలో సిడ్ని ఒలంపిక్స్ లో భారతదేశం సాధించిన ఏకైక పథకం కరణం మల్లేశ్వరిదే కావడం విశేషం . ఈమె 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది.
అంతే కాదు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లేశ్వరి రికార్డు సృష్టించింది.
స్వర్ణమే లక్ష్యంగా కష్ట పడినప్పటికీ కాంస్య పతకం సాధించింది. అయినప్పటికీ 2000 సంవత్సరంలో భారతదేశం నుండి సాధించిన ఏకైక పథకం ఈమేదే కావడం తెలుగువారందరికీ గర్వకారణం.

మల్లీశ్వరి 1997లో హరియాణాకు చెందిన వెయిట్‌ లిఫ్టర్‌ రాజేష్‌ త్యాగిని వివాహం చేసుకుంది.
ఆమె ప్రస్తుతం హరియాణాలోని భారత ఆహార గిడ్డంగుల శాఖ(ఎఫ్.సి.ఐ) లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
ఈమధ్యనే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం
ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ)గా కరణం మల్లీశ్వరి నియమిస్తూ 22 జూన్ 2021న ఉత్తర్వులు జారీ చేసింది.
భారతదేశంలో తొలి క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ గా తెలుగు జాతి ఆణిముత్యం కరణం మల్లేశ్వరి నియామకం కావడం భారత క్రీడా రంగంలో తెలుగు వారికి దక్కిన గౌరవం.

కరణం మల్లేశ్వరి ఇంతవరకు పొందిన
పురస్కారాలు , గౌరవాలు.
*భారత ప్రభుత్వం అర్జున అవార్డు
*1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
*1999- పద్మశ్రీ పురస్కారం
మధ్యతరగతి కుటుంబానికి చెందిన
మహిళ స్వయం కృషితో పట్టుదలతో ప్రయత్నం చేసి ప్రపంచ స్థాయికి ఎదగడం అంత సులభం కాదు. కఠోర దీక్ష పట్టుదలతో కరణం మల్లేశ్వరి ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా నిలిచింది.
భారతదేశంలో అతికొద్దిమంది మహిళలు ఎంతో ఉన్నత స్థితి చేరినప్పటి ఇంకా ఎంతోమంది మహిళలు అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారు .
అందుకు కారణం కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోవడం .స్త్రీలు అనే చులకన భావం.
కానీ మల్లేశ్వరి వాటన్నింటిని జయించి ఉన్నత శిఖరాలకు చేరింది. తెలుగుజాతి మాత్రమే కాకుండా భారత జాతి మొత్తం గర్వంగా చెప్పుకునే మహిళగా నిలిచింది. ఎంతోమంది స్త్రీలకు స్ఫూర్తిదాయకం కరణం మల్లేశ్వరి.

situs slot gacorslot88