Personality In Detail!



తెలుగు జాతి గర్వించదగిన గణిత శాస్త్రజ్ఞుడు
కల్యంపూడి రాధాకృష్ణారావు

సీఆర్‍రావుగా ప్రఖ్యాతి గడించిన ఈయన
1920 సెప్టెంబరు 10 న బళ్ళారి జిల్లాలోని హదగళిలో జన్మించాడు.

అప్పటికి బళ్ళారి ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంది. దత్త మండలాల లో భాగంగా ఆరోజు బళ్ళారి తెలుగు ప్రాంతంలో అంతర్భాగం.
ప్రస్తుతం పిలువబడుతున్న రాయలసీమ ప్రాంతం ఆనాడు దత్తమండలం గా పిలువబడుతూ ఉండేది .
దత్తమండలం లో అనంతపురం, బళ్లారి ,కడప ,కర్నూలు జిల్లాలు మాత్రమే ఉండేవి.

ఆంధ్రదేశమే కాకుండా భారతదేశంతోపాటు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త కృష్ణా రావు గారు.


నూజివీడు, నందిగామలో చదివారు.
విశాఖపట్నంలో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసారు.
ఈయన చదివిన అన్ని తరగతిల్లోనూ ఫస్టు ర్యాంకు సాధించారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందారు.

విశాఖపట్నం నుండి కలకత్తా వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరారు.

1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన     మొదటి కొద్దిమందిలో ఆయన ఒకరు.

" టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు.

ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి.



ఈయన తాను చదివిన కలకత్తా విశ్వవిద్యాలయ లో మొదటి ర్యాంకు సాధించారు. అందులోనే లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా పరిశోధనలు ప్రారంభించారు.
పరిశోధనలతో భాగంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నారు.
పరిశోధనాంశములతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రెస్ వారి ఈయన గ్రంథ రచనను వెలువరించారు.

ఇన్ని విజయాలు సాధించిన రావు గారికి అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.


ప్రొఫెసర్ గా,
గణాంక శాస్త్ర విభాగపు అధిపతిగా బాధ్యతలు నెరవేర్చుటకంటే పరిశోధనలే పరమావధిగా భావించారు.

కలకత్తా ఇనిస్టిట్యూట్ లోనే 40 సంవత్సరాలుగా పరిశోధనలు సాగించారు.వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు.
ఆయన కలకత్తా ఇన్స్టిట్యూట్ లో పని చేస్తూ ఉండగా అంతకు ఐదురెట్లు వేతన ఇస్తామని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఆయనను ఆహ్వానించినప్పటికీ ఆయన ససేమిరా అంగీకరించలేదు. ఇది రావు గారి నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

350 పరిశోధన పత్రాలు రాసి 17 దేశాల నుంచి 29 డాక్టరేట్లు అందుకున్న ఈయన మొత్తం 14 గ్రంథ రచనలు చేసారు. వీటిలో మూడు గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలోనికి అనువాదమయ్యాయి.

ఇతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు,, గౌరవాలు అందాయి.
వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది.
వాటి దేశప్రధాని నెహ్రూ చేతులమీదుగా అత్యుత్తమ శాస్త్రవేత్తలకు అందించే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు. వేదిక మీదనే ఆ ప్రైజ్ మనీని అవార్డు అందించిన నెహ్రూ ద్వారా దేశ రక్షణనిధికి సమర్పించారు.

అమెరికాలో ప్రతి యేటా అత్యుత్తమస్థాయి శాస్త్రవేత్తలకు అందించే "నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్"ను అమెరికా అధ్యక్షులు జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్నారు.

రష్యా సైన్స్ అకాడమీ 200 సంవత్సరాల వేడుకలో ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలకు ఆహ్వానించగా ఈయనకు ఆ అపూర్వ అవకాశం దక్కింది.

ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ (లండన్) కు ఫెలోగా ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఆయన.

పద్మవిభూషణ (2001), భారత ప్రభుత్వం వారిచే అందుకున్నారు.
ఇంటర్నేషనల్ మహాలనోబిస్ ప్రైజ్ (2003), ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ వారిచే
శ్రీనివాస రామనుజన్ మెడల్ (2003),

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారిచే నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ను 2002 జూన్ 12 లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుస్ చే అందుకున్నారు.
ఇండియన్ సైన్స్ అవార్డు 2010


ఈయన పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకనమిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ , మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది.

situs slot gacorslot88