zaza
za
azerthyu
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్:
మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
టెన్త్ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి సురేష్ తెలిపారు.
జాతీయ విద్యా విధయనం 2019 ముసాయిద్య సారాంశం.
Ministry of Human Resource Development Government of India