తెలుగు వెలుగుల వ్యక్తులలో మనం గర్వంగా చెప్పుకోదగిన చెప్పుకోగలిగిన వ్యక్తి జస్టిస్ ఎన్. వి రమణ గారు.
ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ గారు.
ఈయన జస్టిస్ ఎన్. వి.రమణగా సుప్రసిద్ధులు.
తెలుగు భాషపై మక్కువ ఎక్కువ.
అవసరమైతేతప్ప ఆంగ్లంలో మాట్లాడరు.
తెలుగులోనే పలుకరిస్తారు.
న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు.
మనకు తెలిసిన మన యాసతో కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారాయన.
ఒక తెలుగువాడిగా దేశం అత్యున్నత పదవిలో ఉండి కూడా మాతృభాష కు ఆయన ఇస్తున్న విలువ కు చేతులెత్తి నమస్కరించిన వచ్చు.
మాతృభాషకు ఎదురవుతున్న నిరాధారణను పలువేదికలపై ఆవేదన చెందారాయన.
" ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్ " అనే పుస్తక ఆవిష్కరణ సందర్భములో " చైనా , జపాన్ లలో ఆంగ్లానికి ప్రాధాన్యమేమీ లేదు . అయినా ఆ దేశాలు ఏంటో అభివృద్ది చెందాయి, ఆంగ్లం వస్తేనే అభివృద్ది చెందగలమన్నది అపోహే " అని మాతృ భాష పై
తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
అంతకు పూర్వం 1966 - 1967 తెలుగు వ్యక్తి శ్రీ కోకా సుబ్బారావు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలను నెరవేర్చారు.
భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ శిఖరంపై ఆసీనుడైన రెండవ తెలుగు వారు.
జస్టిస్ నూతలపాటి వెంకటరమణగారు
జనవరి. 1957 ఆగస్టు 27న
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం, పొన్నవరం గ్రామంలోని
ఒక మధ్యతరగతి రైతు కుటుంబమైన
శ్రీమతి సరోజిని ,శ్రీగణపతి రావు అనే దంపతులకు
జన్మించారు.
ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు .
అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్. (రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు) కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందారు.
1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు.
1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు.
2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2013 సెప్టెంబరు 2
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
సుప్రీంకోర్టు ఎనిమిదేళ్ల పాటు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్,
అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత.
పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు.
కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు.
2021 ఏప్రిల్ 24 వ తేదీన 63 సంవత్సరాల వయసులో భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన సి.జె గా ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగష్టు 26 వరకూ 16 నెలల పాటు పదవిలో వుంటారు.
జస్టిస్ రమణ గారు ఎన్నో విలువైన తీర్పులను ఇచ్చారు
కులాలు, మతాలవారీ రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు.
పర్యావరణ కేసుల్లో చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని తీర్పులు చెప్పారు.
13 సంవత్సరాల కాలంలో దాదాపు 60వేల కేసులను పరిష్కరించారు.
2020లో అమరావతి రాజధాని భూముల విషయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ అవి కేవలం నిరాధార పూరితమైనవిగా తేలడంతో వాటి నుంచి బయటపడ్డారు.
తెలుగువాడిగా తెలుగు భాషపై మమకారం ఉన్న వ్యక్తిగా తెలుగుజాతి గౌరవాన్ని దేశస్థాయిలో వినిపించే స్వరంగా ఆయననెప్పుడూ ఈ తెలుగు జాతి గుర్తుంచుకుంటుంది.