రిజర్వు బ్యాంకు 22వ గవర్నర్ గా పని చేసి
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవికే వన్నె తెచ్చిన తెలుగు వ్యక్తి దువ్వూరి సుబ్బారావు గారు.
ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి ఈయన.
అత్యధిక జ్ఞాపకశక్తి ఉన్న వ్యక్తులలో ఈయన కూడా ఒకరు
దువ్వూరి సుబ్బారావు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చెందిన
మల్లికార్జునరావు సీతారామం దంపతులకు
1949 ఆగష్టు 11న
మూడవ సంతానంగా జన్మించాడు ఈయన.
దువ్వూరి సుబ్బారావు గారి తండ్రి మల్లికార్జున రావు గారు
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.
కోరుకొండ సైనిక పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసిన ఈయన
బిఎస్సీ సీఆర్ఆర్ కళాశాలలో పూర్తి చేశాడు.
అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు.
1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.
1988-93 : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రెటరీగా
1993-98 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా
1998-04: ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం
2004-08 : కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా
తరువాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా 2008లో
నియమితుడై, ఆ పదవిలో 2013 సెప్టెంబరు 4 వరకు ఉన్నాడు.
2014 - సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో విశిష్ట అధ్యాపకుడు (Distinguished Visiting Fellow ) పని చేశారు.
గొప్ప ఆర్ధిక రంగ నిపుణుడి ప్రపంచ స్థాయి మన్ననలను పొందాడు. 2016లో నరేంద్ర మోడీ నోట్ల రద్దు ను చేపట్టినప్పుడు సమర్ధించాడు.తద్వారా నల్లధనం వెలుగులోకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్లుగా
పనిచేసిన వ్యక్తులలో చురుకైన వ్యక్తిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మొహమాట మన వ్యక్తిత్వం. దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని పరిశీలించి తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన పాత్ర అమోఘం.
తెలుగు జాతి ఔన్నత్యాన్ని మేధాశక్తిని ప్రపంచానికి చాటాడు సుబ్బారావు గారు.