Personality In Detail!భారత దేశం గర్వించదగ్గ మహిళ దుర్గాభాయి దేశముఖ్. చిన్ననాడు తనకు జరిగిన బాల్యవివాహాన్ని ఎదిరించి,
దాన్ని త్యజించి ఉన్నత చదువు చదివింది. ప్రతిష్టాత్మకమైన న్యాయవాద వృత్తిని చేపట్టింది. సంఘ సేవకురాలిగా, స్వాతంత్ర సమరయోధురాలుగా, మహిళాభ్యున్నతికి పాటుపడిన స్త్రీ మూర్తిగా దేశ మన్ననలను పొందింది.
చాలామందికి ఈమె తెలుగు బిడ్డ అని తెలియదు.
తెలుగు జాతి మొత్తానికి వన్నెతెచ్చిన స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ ముఖ్.
ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి
భారత స్వాతంత్ర సమర యోధురాలుగా,
సంఘ సంస్కర్తగా,
రచయిత్రిగా,
న్యాయవాదిగా,
సామాజిక కార్యకర్తగా,
తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నారు.

ఈమె రాజమండ్రిలో మద్య తరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు 1909 జూలై 15 న జన్మించారు.
8 ఏండ్ల వయసులో ఆమె మేనమామ సుబ్బారావుతో వివాహమయింది.
తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు.
బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించింది.
తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది.
తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. అందులో భాగంగా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది.

1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది.
మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది.
స్వాతంత్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసింది.
 బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌,
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తి చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచింది.

దుర్గాబాయి చేసిన సామాజిక సేవలు దేశం పట్ల ఆమె నిర్వహించిన బాధ్యతలు అన్నీ ఇన్నీ కాదు.

* ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.
* చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు.
* 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.
* చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనం అను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు.
* ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.

దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు.
* ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నపట్నంలో  ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.
*1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది.
*ఆమె చేసిన విశేషమైన సామాజిక సేవల వలక
 దేశ ప్రజలచేత సామాజిక సర్వీస్ మదర్ గా పిలిపించుకున్నారు.

దుర్గాబాయి నిర్వహించిన రాజ్యాంగబద్ధమైన అధికారికమైన బాధ్యత నిర్వహించారు.

*ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగసభలో 1946-2950 మధ్య సభ్యురాలుగా ఉన్నారు
*1952లో ప్రణాళికా సంఘ సభ్యురాలుగా ఉన్నారు.
రాజ్యాంగ సభ సభ్యురాలు గా ఉన్న ఈ సమయంలో
చింతామణి దేశ్ ముఖ్ తో పరిచయం ఏర్పడింది .
ఆ పరిచయం కాస్తా పరిణయానికి దారి తీసి స్వాతంత్రానంతరం చింతామణి దేశ్ ముఖ్ ఆర్థికమంత్రిగా ఉండగా1953 జనవరి 22న ఆయనతో వివాహం జరిగింది.అప్పుడు దుర్గాబాయి వయసు 44సంవత్సరాలు.
* ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది.

* ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసింది.
1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది.

ఈమె చేసిన విశేష సేవలకుగాను ఎన్నో గౌరవాలు పొందింది.

* వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా
1971 - నెహ్రూ లిటరసీ అవార్డు
* ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.
* యునెస్కో నుండి పాల్ జి. హాఫ్‌మన్ అవార్డు..
* 1975 - పద్మ విభూషణ్ పొందింది.
అదే సంవత్సరం ఆవిడ భర్త సి.డి.దేశ్‌ముఖ్ కూడా పద్మ విభూషణ్ పొందారు.
దుర్గాబాయి 1981 మే 9వ తేదీన హైదరాబాదులో మరణించారు.

దుర్గాబాయి మరణానంతరం కూడా ఈ దేశం ఈ ప్రాంతం ఆమెను స్మరించుకోవడం కోసం ఎన్నో గౌరవ చిహ్నాలు ఏర్పాటు చేసుకున్నారు.

* రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర సమరయోధుల పార్కులో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ విగ్రహం ఏర్పాటు చేశారు.

* కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు.

* ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు.

* ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.

దుర్గాభాయి దేశముఖ్ గొప్ప సంఘసంస్కర్త. చిన్ననాడు తన ప్రమేయం లేకుండా జరిగిన బాల్యవివాహాన్ని ఎదిరించింది. ఏ మాత్రం అధైర్యపడకుండా ఉన్నత విద్య వైపు దృష్టి సారించి పేరెన్నికగన్న క్రిమినల్ లాయర్ గా గుర్తింపు పొందింది .దేశ స్వాతంత్ర ఉద్యమంలో చిన్నతనంలోనే అడుగు వేసింది.
వేల మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దింది. వారి కోసం ప్రత్యేక పత్రికను నడిపింది .
తానే సంపాదకత్వం వహించింది .
44 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుని
ఎంతోమంది మహిళలకు ఆదర్శప్రాయమయింది
విజ్ఞానవంతురాలు ధైర్యవంతురాలు
మహిళలు తలచుకుంటే ఎంత గొప్ప స్థాయికి చేరగలదో నిరూపించిన గొప్ప వనిత దుర్గాబాయి.
తెలుగు నేలలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ దేశం గుర్తుంచుకోదగిన మహోన్నత వ్యక్తుల లో
ఆమె ముందు వరుసలో ఉండటం తెలుగు జాతి అదృష్టం. సామాన్యమైన కుటుంబంలో పుట్టి అందులోనూ మహిళ అంచెలంచెలుగా ఎదిగి దేశ స్వాతంత్ర ఉద్యమంలోనే రాజ్యాంగ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించటం సామాన్యమైన విషయం కాదు. ఈనాటి కోట్ల మంది మహిళలకు దుర్గాబాయి ఆదర్శమైన మహిళ.

situs slot gacorslot88