తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి విమర్శకుడు
సాహితీవేత్త,
ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి
విద్యావేత్త,
పండితుడు,
వక్త,
కవి,
హేతువాది.
ఆదర్శవాది,
రాజనీతిజ్ఞుడు.
డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు.
విద్యా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించి,
తిరిగి రాజకీయ రంగం నుండి విద్యా రంగం లోకి పున:ప్రవేశించి తన అసమాన ప్రతిభాపాటవాలతో
విద్యావంతుల చేత సాహితీ మెరువుల చేత మన్ననలు పొందిన తెలుగువాడు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు. తెలుగు తో సమానంగా ఆంగ్లంలోనూ ప్రసంగించగల దిట్ట రామలింగారెడ్డి గారు.
రామలింగారెడ్డి గారు చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో
శ్రీమతి నారాయణమ్మ ,శ్రీ సుబ్రహ్మణ్యరెడ్డి
1880 డిసెంబరు 10న జన్మించాడు.
కట్టమంచి చిత్తూరు - తిరుపతి మార్గంలో ఇది ఒక చిన్న పల్లె .కుటుంబంలో ఇతడు మూడో సంతానం.
సుబ్రహ్మణ్యరెడ్డి సోదరుడు పెద్దరామస్వామిరెడ్డి రామలింగారెడ్డిని దత్త పుత్రుడుగా స్వీకరించాడు.
వీధిబడి తో మొదలైన కట్టమంచి వారి విద్యాభ్యాసం అంచెలంచెలుగా ఎదిగి భాష ప్రాంతం భేదం లేకుండా ఎల్లలు దాటింది.
1890లో చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలో మొదటి ఫారం చదివాడు.
1902లో బి ఎ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించి బంగారు బహుమతి అందుకున్నాడు.
డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోనూ సెయింట్ జాన్స్ కళాశాల లో విద్యనభ్యసించే అవకాశం దక్కించుకున్నారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. 1906లో ఎం.ఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు.
ప్రతిభావంతులు తాము ఎక్కడున్నా తన ప్రతిభను చాటుకుంటారు. కట్టమంచి వారి విషయంలోనూ అదే జరిగింది కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన తర్వాత తన అసమాన ప్రతిభాపాటవాల చేత విదేశీయులను సైతం మంత్రముగ్ధులను చేసే వాడు.
ఫలితంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఈ గౌరవం పొందిన తొలి భారతీయుడు కట్టమంచి వారే.
1903లో "రైట్" బహుమతి పొందాడు.
1905లో "విద్వాంసుడు" పురస్కారాన్ని అందుకున్నాడు.
రామలింగారెడ్డి గారు విదేశాల విద్య ముగించి వచ్చిన తర్వాత భారతదేశంలోని బరోడా సంస్థానంలో విద్యాశాఖ ఉద్యోగం లభించింది. అయితే ఉద్యోగంలో చేరడానికి ముందే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను పరిశీలించవలసిందిగా అమెరికాకు పంపారు బరోడా సంస్థానాధీశుడు .
అమెరికా అమెరికా పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత 1908లో తన 24వ ఏట బరోడా కళాశాలలో ఆచార్యునిగా ను ఉపాధ్యక్షునిగా నూతన జీవితాన్ని ప్రారంభించాడు.ఇదే సమయంలో ఆయన విద్యార్థుల పరిశీలించడానికి అమెరికా, ఫిలిప్పీన్స్ , జపాన్ దేశాలు సందర్శించాడు
అటు తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్యుడిగా పదవి చేపట్టాడు .
12 సంవత్సరాలపాటు ఆ కళాశాలలో పని చేసాడు .
ఆ సమయంలో ఆయన ఎన్నో సంస్కరణ వంతమైన కార్యక్రమాలు చేపట్టారు .
హరిజనులకు పాఠశాల విద్య కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేయండి .
మైసూరు విశ్వవిద్యాలయానికి రూపకల్పన ప్రణాళికలు చేశాడు.
ఈయన మైసూర్ లో ఉండగానే ప్రతి ఊరికి ఒక పాఠశాల అని ఉద్యమం ప్రారంభించాడు.
1921లో తన పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు కట్టమంచి రామలింగారెడ్డి గారు.
రాజకీయ జీవితం
1921 తరువాత రాజకీయాల్లో పాల్గొన్నాడు.
1921-25 మధ్య కాలంలో మద్రాసు కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు
. జస్టిస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత యునైటెడ్ నేషనలిస్టు పార్టీలో చేరి డిప్యూటీ లీడర్‌గా వ్యవహరించాడు
1935 లో కాంగ్రెస్ తరఫున మద్రాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు.
1936 లో కొంతకాలంపాటు చిత్తూరు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా పనిచేశాడు.
శాసన సభలో సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు చాలా గొప్పగా ఉండేవి.
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తొలి ఉపకులపతి:
కట్టమంచి రామలింగారెడ్డి గారు రాజకీయరంగంలో ప్రవేశించినప్పటికీ ఆయన ఆంధ్ర హక్కులకోసం శాసనసభలో విస్తృతంగా మాట్లాడేవారు. ప్రధానంగా ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని గట్టిగా పట్టుబట్టారు.
1926లో ఏర్పాటయిన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కు తొలి ఉపకులపతిగా పని చేయడానికి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారాయన.
విద్య అభివృద్ధి పట్ల ఆంధ్రుల హక్కు పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఆయన కృషి అమోఘం. నాటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయం పట్ల చూపిన వివక్షతను నిరసిస్తూ ఉపకులపతి పదవికి రాజీనామా చేశారు.
ఆయన తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపకులపతిగా పనిచేశారు. రాధాకృష్ణగారు 1936లో విదేశాలకు వెళ్ళినప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు తిరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు.
అప్పటి నుంచి అంటే 1936 నుంచి 1949 వరకు సుమారు 14 సంవత్సరాల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప కులపతిగా పనిచేశారు. ఇదే సమయంలో మద్రాసు విశ్వవిద్యాలయానికి కూడా ప్రో ఛాన్సలర్ గా పదవీ స్వీకరించాడు.
కట్టమంచి రామలింగారెడ్డి గారి రచనలు:
ఆయన రచించిన ముసలమ్మ మరణం తొలి ముద్రణ 1900 లో జరిగింది.
భారత అర్థశాస్త్రం,
కవిత్వతత్త్వవిచారం,
ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి,
లఘుపీఠికా సముచ్చయం,
నవయామిని,
భారత ప్రశంస,
అంపకం ,వంటి ఖండ కావ్యాలు.
పంచమి - వ్యాసాల సంపుటం.
వ్యాసమంజరి వ్యాసాల సంపుటం
వేమన
డా.సి.ఆర్.రెడ్డి పీఠికలు
సరస్వతీ సామ్రాజ్యము - గ్రంథాలయోద్ధారక అయ్యంకి వేంకటరమణయ్య సన్మాన సభలో రామలింగారెడ్డి సంకలనం చేసి సమర్పించిన సంచిక .
ముత్యాలసరములు
దేవీభాగవతము
ప్రహసనములు
ప్రతాపరుద్రీయము
కీ.శే.కట్టమంచి సుబ్రహ్మణ్యరెడ్డిగారి సంక్షేప చరితము
ఆధునిక సాహిత్య విమర్శ రీతులు
ఆంగ్లంలో
Drama in the East and West
Speeches on Universitry Reform
Democracy in contemporary India
Congress in Office
Education, Industry & Commerce.
కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు.
వయోభారం చేత మరణంఫిబ్రవరి 24, 1951 (వయస్సు 70) లో శాశ్వతంగా తెలుగు వారికి దూరమయ్యారు ఆయన.
విద్యావేత్తగా
రాజకీయ కోవిదుడుగా
విశేషమైన సాహిత్య విమర్శకుడిగా
కవిగా
తెలుగు విద్యారంగంలోనూ,
సాహితీ క్షేత్రంలోనూ, రాజకీయరంగంలోనూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్న కట్టమంచి రామలింగారెడ్డి గారిని తెలుగునేల ఏనాటికీ మర్చిపోదు.