Personality In Detail!
K.G రామనాథం (గణిత మేధావి).

"నంబర్ థియరీ" లో ప్రసిద్ధి గాంచిన "కొల్లగుంట గోపాల అయ్యర్ రామనాథన్" తెలుగు జాతి ఆణిముత్యం.
1920 నవంబర్ 13న హైదరాబాద్ లో జన్మించిన రామనాధన్ అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్ నిజాం కళాశాలలో బీఏ వరకు చదివిన ఆయన తదనంతరం మద్రాసు లయోలా కాలేజీలో గణిత శాస్త్రంలో ఎం.ఏ పూర్తి చేశారు. కొంతకాలం పాటు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా పనిచేసిన ఆయన (పీహెచ్.డి) పరిశోధన నిమిత్తం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తిచేశారు. అమెరికాలోనే ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ మాతృ భూమి పై ప్రేమతో
1951 లో భారత దేశానికి తిరిగి వచ్చారు. కొలాబా లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో
కే.చంద్రశేఖరన్ బృందంలో చేరి ఆయనతో కలిసి పనిచేశారు.
ఆయన శ్రీనివాస రామానుజన్ పట్ల అమితమైన అభిమానం కలిగి ఉన్నారు. అందువల్లనే ఆయన ప్రచురించిన ప్రచురితం కాని పనుల పైన పని చేయడానికి సిద్ధపడ్డాడు రామనాధన్.
నాటి యువ గణిత శాస్త్రవేత్తలతో కలిసి ఆయన పనిచేశారు. "నంబర్ థియరీ" కోసంఅనేక సంవత్సరాల పాటు పని చేసి దాన్ని అభివృద్ధి చేశారు.
రామనాధం తనకు తెలిసిన దానిని అభివృద్ధి చేస్తూ తనలోని ఆసక్తిని గణిత శాస్త్ర అభివృద్ధి కోసమే ఖర్చు చేశాడు. అందువల్లనే ఆయన దేనినీ ఆశించక పోయినప్పటికీ ఎన్నో గౌరవాలు, పురస్కారాలు ఆయనను వరించాయి. ఆయనను వరించిన పురస్కారాల్లో ప్రసిద్ధి గాంచినవి
1965లో శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం.
1983లో పద్మభూషణ పురస్కారం.
అంతేకాకుండా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ కూడా ఆయనను వరించింది.
రామనాథన్ గారు ఎన్నో వ్యాసాలను ప్రచురించారు. ప్రతిపాదనలు చేశారు .అవి ఈ నాటికీ ప్రామాణికంగా కొనసాగడం గమనార్హం.
ప్రపంచంలో గణిత శాస్త్ర మేధావులు అనుసరిస్తున్న "నంబర్ థియరీ" నిర్మాణంలో కేజీ రామనాధన్
కృషి అపూర్వం. ముఖ్యంగా మన తెలుగువారు కావడం
1992 -మే - 10 న మనకు భౌతికంగా దూరమైన ఆయన
తెలుగు జాతికంతటికీ గర్వకారణం.
ఈయన భార్య పేరు జయలక్ష్మి.
అనంత్ ,మోహన్ వీరి పుత్రులు.
తెలుగు జాతి ఆణిముత్యాలలో ఈయన ఒకరు.situs slot gacorslot88