Personality In Detail!మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

భారత ప్రజల చేత అభినవ కాటన్ దొరగా
కర్ణాటక పితామహుడిగా కీర్తించబడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత దేశ నీటిపారుదల రంగానికి ఎనలేని సేవ చేశారు.
ఇప్పటికీ తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకునే వ్యక్తులలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుగు నెలలో పుట్టలేదు. తెలుగు నెలలో పెరగలేదు.
ఈయన తెలుగుజాతి వారసుడు.
వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, శ్రీనివాస శాస్త్రి గారి పూర్వీకులు మైసూరు ప్రాంతానికి వలస వెళ్లారు.
విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించారు.
నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 12 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని చనిపోయినప్పటికీ ఏమాత్రం నిరాశా నిస్పృహలకు లోను కాలేదు.
చిక్కబళ్ళాపూరు లో ప్రాథమిక విద్య చదువుకున్నారు.
తండ్రి లేని విశ్వేశ్వరయ్య కు తన మేనమామ అండగా నిలిచాడు. బెంగళూరులో తనతో పాటుగా విశ్వేశ్వరయ్యను ఉంచుకొని అక్కడే చదివించారు.
బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యాడు.
తన చదువు పూర్తయిన తర్వాత బొంబాయి లోని ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ గా జీవితాన్ని ప్రారంభించారు. కానీ అనతికాలంలోనే భారత నీటిపారుదల కమిషన్ లో అవకాశం దక్కింది. అందిన అవకాశాన్ని ఆకాశమే హద్దుగా ఉపయోగించుకున్నారు విశ్వేశ్వరయ్య గారు.
నదులపై నిర్మించిన ఆనకట్ట నిర్మాణానికి విశ్వేశ్వరయ్య ఎంతో సేవ చేశారు. నీటి ఆనకట్టకు మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈయనే.
1906 - 1907 మధ్య భారత ప్రభుత్వం తరఫున యెమెన్   ప్రాంతాన్ని సందర్శించి అక్కడి నీటిపారుదల వ్యవస్థను సూక్ష్మంగా పరిశీలించారు.
1908లో హైదరాబాదు మూసీ నదికి వచ్చిన వరదల వల్ల హైదరాబాదు అతలాకుతలం అయ్యింది. దాని మీద సమగ్రమైన అధ్యయనం చేసి 1909 అక్టోబర్ 1న తన నివేదికను సమర్పించారు విశ్వేశ్వరయ్య. ఆయన నివేదిక ప్రకారం ఉస్మాన్ సాగర్ 1920 హిమాయత్ సాగర్ 1927 ఆనకట్టలను అప్పటి ఏడవ నిజాం నిర్మించారు.
కర్ణాటకలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర్ నిర్మాణం లో ఆయన కీలకమైన భూమిక పోషించారు.
దేశంలో పలు నీటిపారుదల ప్రాజెక్టులకు విశ్వేశ్వరయ్య తనదైన సేవ చేశాను. ఆయన ఖ్యాతి కన్నడ ప్రాంతం దాటి భారతదేశం అంతటా వ్యాపించింది. ప్రపంచ శ్రేణి ఇంజనీరుగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాటులో కూడా ఆయన పాత్ర ఉంది.
హైదరాబాదులోని పత్తర్‌గట్టి నిర్మాణానికి డిజైన్ ను అందించాడు.
ఇంజనీర్ గా ఎంతో ఘనకీర్తి సంపాదించుకున్న విశ్వేశ్వరయ్య ఇంకా పదవిలో చేయవలసిన సేవ ఎంతో ఉండగానే 47 ఏళ్ల వయసులో 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
పదవీ విరమణ అనంతరం మైసూరు సంస్థానంలో దివానుగా పనిచేసి సంస్థానం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.

1)మైసూరు సోప్ ఫ్యాక్టరీ.

2)పారాసిటాయిడ్ లేబొరేటరీ

3)విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, భద్రావతి

4)శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్

5)బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం

6)స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

7)ద సెంచురీ క్లబ్

8)మైసూర్ చాంబర్ ఆఫ్ కామర్స్

9)విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు.
వంటి సంస్థలను ఏర్పాటు చేయడంలో విశ్వేశ్వరయ్యదే ముఖ్య పాత్ర.
1915లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది.
భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు అతనుకు గౌరవడాక్టరేట్లతోసత్కరించాయి.
1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
భారత దేశపు అత్యున్నత పురస్కారం(1955) భారతరత్న
పొందిన ఐదో వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య
కావడం విశేషం.
ప్రభుత్వం ఆయన నివసించే నివాసస్థలం పక్కనే స్మారక చిహ్నన్ని ఏర్పాటు చేశారు.
నీటిపారుదల ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలతో పోల్చారు జవహలాల్ నెహ్రూ.
ఈ ఆధునిక దేవాలయాలు రూపకల్పనలో తెలుగు వారి వారసుడు ప్రధాన పాత్ర పోషించండం తెలుగువారందరికీ గర్వకారణం.
ఆయన చేసిన నీటి పారుదల ప్రాజెక్టులు నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ఈ దేశ ప్రగతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

situs slot gacorslot88