Personality In Detail!



కాళీపట్నం రామారావు.

కారా మాస్టారుగా పిలువబడే కాళీపట్నం రామారావు గారు పరిచయం అక్కర్లేని కథకుడు,ఉపాధ్యాయుడు, విమర్శకుడు, అంతకుమించి తెలుగు కథకు చిరునామా ఏర్పరచిన సాహితీ దీక్షితుడు.
ఈయన  1924, నవంబరు 9 న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకలో జన్మించాడు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివాడు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. 1948 నుండి 1972 వరకు ఎయిడెడ్ స్కూల్ లో పనిచేశారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా పదవీవిరమణ చేసిన ఆయన 1972 నుండి తనకు వచ్చే పెన్షన్ మీద మాత్రమే ఆధారపడి జీవించారు.
1964లో ఈయన రాసిన యజ్ఞం కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని పాఠకుల కళ్ళకు కట్టింది. తెలుగు కథా సాహిత్యంలో యజ్ఞం కథ మీద జరిగినంత చర్చ మరో కథ పైన జరగలేదనడం అతిశయోక్తి కాదు.
ఈయన రచనలు
యజ్ఞం (నవల)
అభిమానాలు
రాగమయి
జీవధార
రుతుపవనాలు (కథా సంకలనం)
కారా కథలు
1965లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. విరసం సభ్యులుగా ఉన్న కారా మాస్టారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
తిరిగి 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం చేత గౌరవించబడ్డారు కారా మాస్టారు .
ఈయన కేవలం సాహిత్య సృజనకు మాత్రమే పరిమితం కాలేదు. శ్రీకాకుళం లోతెలుగు కథా సాహిత్యానికి ప్రత్యేకమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
విశ్వవిద్యాలయాలలో తెలుగు కథా సాహిత్యం మీద పరిశోధన చేసే పేద విద్యార్థులు క్షేత్ర పర్యటన వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని కథలకు ఓ నిలయం కట్టారు.దాని పేరే కథానిలయం.
రెండు తెలుగు రాష్ట్రాల లో తెలుగు కథకు రచయితలందరికీ ఓ చిరునామాగా దాన్ని తీర్చిదిద్దారు. 1997 ఫిబ్రవరి 22న కేవలం కొన్ని పుస్తకాలతో మాత్రమే ప్రారంభమైన కథానిలయం నేడు లక్షకుపైగా కథాపుస్తకాలు 25 వేలకు పైగా పత్రికలు ఉన్నాయి.
వీటికి తోడు కథలపైన వచ్చిన విమర్శ వ్యాసాలు కథారచయిత పరిచయాలు, కథా రచయిత చిత్రాలు కథానిలయంలో ఉంచారు.
విశ్వవిద్యాలయము లేదా ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాన్ని ఒక వ్యక్తిగా కారా మాస్టారు సాధించటం ఆయన సాహితీ దీక్షకు సాక్ష్యం.
తనకు పెన్షన్ గా వస్తున్న ప్రతి రూపాయిని కథానిలయం నిర్మాణానికి ఉపయోగించారు.కథానిలయం వార్షిక దినోత్సవం ఆయన ఇంట్లో ఓ పండుగలా జరిగేది. ఎంతో మంది సాహితీవేత్తలను సాహితీ ప్రియులను సాహితీ అభిమానులను కథానిలయానికి ఆహ్వానించేవారు. కథానిలయం లో ఓ సభా వేదిక కూడా ఏర్పాటు చేయటం సాహిత్యం పట్ల ఆయనకున్న అభిలాష కు అద్దం పడుతుంది .
తాను గొప్ప కథారచయితనని గానీ సాహితీవేత్త నని గానీ తనకు తానుగా భావించుకోని ఆయన ప్రతివారిలోనూ ఎంతో గౌరవంగా మెలిగేవారు. వ్యక్తిగా సాటి మనిషిని గౌరవించడంలో కారా మాస్టారు ముందుండేవారు. తాను వచ్చిన కార్యక్రమం పూర్తి అయిందన్నట్టుగా 97 సంవత్సరాల వయస్సులో 2021 జూన్ 4వ తారీఖున తెలుగు కథా సాహిత్యాన్ని వదిలి దివికి చేరారు కారా మాస్టారు.

situs slot gacorslot88