Personality In Detail!డా,, కె.ఎల్.రావు ( ప్రఖ్యాత ఇంజనీరు)

కె.ఎల్.రావు గా ప్రసిద్ధి గాంచిన కానూరి లక్ష్మణరావు తెలుగుజాతి ఆణిముత్యం.
నీటిపారుదల రంగంలో అభినవ భగీరథుడిగా కీర్తించబడిన కె.ఎల్.రావు భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా నీటిపారుదల రంగంలో విప్లవాత్మకమైన పనులు చేసిన గొప్ప ఇంజనీరు.
ఈయన 1902 జూలై 14న కృష్ణా జిల్లా  కంకిపాడు గ్రామములో జన్మించాడు.
ఈయన తండ్రి గ్రామ కరణము.
ఈయన తొమ్మిది సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించాడు.
తన పెదతండ్రి పెద్దన్న ల సంరక్షణలో పెరిగాడు. కె.ఎల్.రావు గారు.
బాల్యము నుండే ఈయన ప్రతిభావంతమైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, ప్రముఖ భాషా సేవకులకు కొమర్రాజు
లక్ష్మణ్ రావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు
శ్రీమతి డా,,అచ్చమాంబ గారు కెఎల్ రావు గారికి సమీప బంధువులు
తన పెద్దన్న ప్రోత్సాహకాలతో గిడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశారు .
తరువాత మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందిన తొలి విద్యార్థి రావు గారే కావడం విశేషం.
చదువు పూర్తయిన తర్వాత విశాఖ జిల్లా బోర్డు అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేశారు. తదనంతరం రంగూన్ కూడా ఉద్యోగం చేశారు.
కొంతకాలం తర్వాత రావు గారు గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో పరిశోధకుడిగా చేరారు.
ఇంగ్లండ్లోని బర్నింగ్ హోమ్ విశ్వవిద్యాలయం నుండి 1939 లో డాక్టరేట్ డిగ్రీ పొందాడు.
కొంతకాలం పాటు ఇంగ్లాండ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన ఆయన 1946లో భారతదేశం తిరిగి వచ్చి మద్రాసు ప్రభుత్వంలో డిజైన్ ఇంజనీర్ గా చేరారు. 1950 - 54 మధ్యకాలంలో భారత ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీర్ గా పని చేశారు.
భారత ప్రభుత్వంలో ఇంజనీర్ గా పనిచేస్తున్న కాలంలో భారతదేశంలోని అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు నమూనాలు తయారు చేశాడు.
నాగార్జునసాగర్ ,పులిచింతల ,శ్రీశైలం, శ్రీరాంసాగర్
వంటి ఎన్నో సుప్రసిద్ధ నీటిపారుదల పథకాలకు రూపకల్పన చేశాడు.
గంగా, బ్రహ్మపుత్ర దేశంలో జరుగుతున్న వరదల నివారణకై అనేక సూచనలు సలహాలు ఇచ్చారాయన.
అందులో భాగంగానే గాంధీ సాగర్ , జవహర్ సాగర్ రాణాప్రతాప్ సాగర్ వంటి నిర్మాణాలు సిద్ధం చేశారు.
ఆయన మేధాసంపత్తికి ఇవి మచ్చుతునకలు.
ఇంజనీరింగ్ సంబందించిన అనేక విజ్ఞాన దాయకమైన సమాచారాలను సామాన్య ప్రజలకు చేరవేసే ఉపయుక్తమైన ఉపన్యాసాలెన్నో ఇచ్చారాయన.
ఇంజనీరింగ్ ను సాంఘిక అభివృద్ధి విజ్ఞానంగా అభివర్ణించారాయన.
నాటి ప్రభుత్వం నాగార్జునసాగర్ ,భాక్రానంగల్ ప్రాజెక్ట్,
హిరాకుడ్ ప్రాజెక్ట్ విషయంలో విదేశీ ఇంజనీర్లను పిలిపిస్తే వారు కూడా రావు గారిని సంప్రదించడం ఈయన ప్రతిభకు నిదర్శనం.
ఇంజనీరింగ్ విషయాలకు సంబంధించి ఈయన రాసిన "ఇండియాస్ వాటర్ వెల్త్" అనే పుస్తకం నేటి తరాల శాస్త్రవేత్తలకు ప్రామాణిక గ్రంథంగా ఉంది.

ఉద్యోగ విరమణ అనంతరం అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు నీలం సంజీవరెడ్డి గారి పిలుపుమేరకు
1962, 1967 ,1971 లో విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు.
జోహార్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారాయన.
ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే గంగా బ్రహ్మపుత్ర నదిలో వర్షాకాలంలో చేరుతున్న నీటిని నిల్వ ఉంచి భారతదేశంలో క్షామ ప్రాంతాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నీటి సౌకర్యం కల్పించే "నేషనల్ వాటర్ గ్రిడ్" పథకానికి రూపకల్పన చేశారు రావు గారు.
కృష్ణా తీరం వెంబడి కట్టిన కరకట్ట నిర్మాణం ,ఇంద్రకీలాద్రి పైకి ఏర్పాటుచేసిన ఘాట్రోడ్డు వంటివి ఈయన నిర్వహణలో జరిగినవే. దేశంలో నదుల అనుసంధానం గురించి మొట్టమొదట ప్రస్తావించింది ఈయనే.
ఇప్పటికీ అది కుదరక పోవడం భారత దేశ అభివృద్ధికి ఆటంకమనే చెప్పాలి.
సుదీర్ఘ కాలం తన మేధా సంపత్తితో భారతదేశం నీటిపారుదల రంగానికి దిశ దశను నిర్ణయించిన రావు గారు తెలుగువారు కావడం మన అందరము గర్వించదగ్గ విషయం.
ఈయన 1986 మే 18 న 84 సంవత్సరాల వయసులో శాశ్వతంగా తెలుగునేలను విడిచారు.

situs slot gacorslot88