.
శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు(చారిత్రక సాహిత్య పరిశోధకులు)
తెలుగువారిలో భాష చరిత్రల మీద పరిశోధనాసక్తి కలిగించిన మహనీయుడు శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారు.
ఈయన పేరు వినగానే తెలుగువారి అందరికీ గుర్తొచ్చేది "విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి".ఆయన నిత్య విద్యార్థి.
అవిశ్రాంత చారిత్రిక సాహిత్య పరిశోధకులు .
ఈయనను తెలుగువారి తలపులలో నిలిపే మరో ఉన్నతమైన కృషి "ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం".
ఇవి తెలుగు వారి కీర్తి కిరీటంలో మకుటాయమానంగా నిలిచాయి.
కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలు గ్రామంలో వేంకటప్పయ్య ,గంగమాంబ దంపతులకు "మే 18 -1876 " లో జన్మించారు లక్ష్మణ్ రావు గారు .
4 సంవత్సరాల వయసులో తడ్రిని కోల్పోయారు.
తాత ముత్తాతల కాలం నుండి వీరి కుటుంబానికి గ్రామ కరణం ఉంది .
తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ లక్ష్మణరావు గారి సోదరి.
తండ్రి మరణించాక తన మేనమామ (అమ్మ తమ్ముడు) బండారు మాధవ రావు గారిని వివాహం చేసుకుంది. అచ్చమాంబ ,మాధవరావు నాగపూర్ లో ఉన్నారు.
తండ్రి లేకపోవడంవల్ల లక్ష్మణ రావు గారు అక్క బాలల చెంత చదువుకున్నాడు. నాగపూర్ లో ఉండటం వల్ల మరాఠీ ,హిందీ, సంస్కృతం, తెలుగు భాష పై అధ్యయనం చేశాడు.అక్కడే బి. ఎ చదివారు.
తెలుగు నేలకు చేరి మునగాల సంస్థానంలో దివానుగా పని చేశారు .
తరతరాలుగా మునగాల సంస్థానాధీశుల వద్ద లక్ష్మణరావుగారి కుటుంబీకులు దివానులుగా పనిచేశారు.
సంస్థానం పనిమీద హైదరాబాద్ కు తరచు వెళ్ళి వచ్చేవారు లక్ష్మణరావుగారు
అక్కడ కొందరు మిత్రులతో కలిసి 1901 సెప్టెంబరు 1న
"శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం"స్థాపించారు.
కొంతకాలం తర్వాత సంస్థానం నిమిత్తం మద్రాసు లో ఉండవలసి వచ్చింది లక్ష్మణ రావు గారు .
అప్పుడే ఆయనకు గాడిచర్ల హరిసర్వోత్తమరావు తోనూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి తోనూ,
ఆచంట లక్ష్మీపతి తోనూ పరిచయం ఏర్పడింది.
వారి సహచర్యం లక్ష్మణ రావు గారిని సాహిత్య చారిత్రక విషయాలలో లోతైన అధ్యయనం చేయడానికి ఉపకరించింది.
ప్రాంతం ఏదైనా సరే మాతృభాషలో సాహిత్య చారిత్రక కృషి చేయాలనే ఆయన సంకల్పం ,ఆకాంక్ష .
అందుకు తగ్గట్టే మిత్రులతో కలిసి
"విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి"స్థాపించారు.
ఈ సంస్థ సాహిత్య చారిత్రికంగా విశేష కృషి చేసింది.
దేశ చరిత్రలు,
స్వీయ చరిత్రలు ,
సంఘసంస్కర్తల జీవిత చరిత్రలు ,
శాస్త్ర గ్రంథాలు ,
చారిత్రక గ్రంథాలు ,
భారతదేశ చరిత్ర ,
చారిత్రక నవలలు వంటి పుస్తకాలెన్నింటినో ప్రచురించింది.
ఆంధ్రుల "విజ్ఞాన సర్వస్వాన్ని" రచించాలన్నది ఆయన స్వప్నం.
దాని లో భాగంగానే ని ఆయన 1922లో హైదరాబాద్ లో పరిశోధనా గ్రంధ మండలి స్థాపించారు.
తెలంగాణలోని ,
తామ్ర శిలా శాసనాలు ,
శాసనాలు ,
వ్రాతప్రతులు ,
తాళపత్రాలు, సేకరించారు లక్ష్మణరావు గారు.
ఆంధ్రభాషలో విజ్ఞాన సర్వస్వాన్ని రచించాలనే సంకల్పంతోనే అకారాది క్రమంలో మూడు సంపుటాలను 50 అక్షరాల వరకు ప్రచురించారాయన.
ఆ పనిని నిర్విఘ్నంగా జరుగుతూ ఉండగానే అనారోగ్యం వల్ల 1923 జూలై 12 న మద్రాసులో పరమపదించారు.
ఆయన తలపెట్టిన పనిని ఆయన మరణానంతరం మరో సంస్థ పూర్తి చేయడం విశేషం.
తెలుగు వారందరికీ సాహిత్య చారిత్రక అంశాల పట్ల పరిశోధనాసక్తిని కలిగించిన మహోన్నత వ్యక్తి లక్ష్మణ రావు గారు.
తెలుగు నెలలో అన్ని ప్రాంతాల్లోని ప్రముఖ సాహిత్య చారిత్రిక అధ్యయన కారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి .
ఆయన తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం.