Personality In Detail!వేటూరి ప్రభాకర శాస్త్రి గారు.

వేటూరి ప్రభాకర శాస్త్రి పేరు వినగానే మనకు సాహిత్య చారిత్రక పరిశోధకుడు గానే జ్ఞాపకం వస్తాడు.
కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత, తెలుగు, సంస్కృత పండితుడు శాస్త్రి గారు.
1888 ఫిబ్రవరి 7న వేటూరి సుందర శాస్త్రి శేషమ్మల గారికి జన్మించాడు ప్రభాకర శాస్త్రి గారు.
ఈయన పుట్టిన కృష్ణాజిల్లాలోని పెదకళ్ళేపల్లి, గ్రామం వేద విద్యలకు నెలవు.
తంగిరాల వెంకటావధానులు,
యడవల్లి అప్పావధానులు,
శిష్టాచయనులు
మొదలైన ఉద్దండ పండితులు ఈ గ్రామం వారే.
వీరి తండ్రి వేటూరి సుందర శాస్త్రి వైదిక, జ్యోతిష్య ,
శిల్ప ,సంస్కృత ,ఆయుర్వేదాలలో నిష్ణాతులు.
ఈయన నలుగురు కుమారులలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రెండవ కుమారుడు.
ఆయన పుట్టిన గ్రామం, తన తండ్రి గొప్ప పండితుడు కావడం వల్ల సహజంగానే ఆయన సాహితీ ప్రకర్షకు అబ్బింది.
అనేక శాస్త్ర అ గ్రంథాలు చదువుకున్నారు బందరులోని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి శిష్యగణం లో ఈయన ఒకరు గా చేరారు . అవధాన విద్య నేర్చుకున్నారు.
ఆ తరువాత తన 19వ యేట మద్రాసు చేరి వెస్లీ మిషన్ హైస్కూలులో తెలుగు పండితునిగా రెండేళ్ళు పని చేపిన
తర్వాత మద్రాసు ఓరియంటల్ లైబ్రరీలో ఉద్యోగిగా లో చేరారు.
1910లో మహాలక్ష్మి గారితో వివాహమైంది గ్రంథాలయంలో ఉండగానే ప్రాచ్యలిఖిత పుస్తక పండితులుగా 30 సంవత్సరాలపాటు పరిశోధన చేశారు సాహితీ సృజన కంటే సాహితీ సేకరణ సాహిత్య పరిశోధన పట్ల ప్రభాకర శాస్త్రి గారికి ఆసక్తి ఉండేది.
ఈయన సాహిత్య పరిశోధన వల్ల ఎన్నో చారిత్రక విషయాలు వెలుగులోకి వచ్చాయి

1940- 50 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానంపై తిరుపతిలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలో పరిశోధకుడిగా చేరారు .
తరువాత సంస్కృత కళాశాల ప్రధానాచార్యులుగా కూడా పనిచేశారు.

* తొలి తెలుగు పదం నాగబు ను గుర్తించారు.
* కల్నల్ మెకంజీ కైఫియత్తులు వెలుగులోకి తెచ్చారు.
* ఎన్నో విలువైన తాళపత్రాలను గుర్తించి సేకరించారు. *   ప్రబంధ రత్నావళి తాళ్ళపాక వారి సంకీర్తనలు మొదలైనవి వెలుగులోకి తెచ్చారు.
*తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్కను గుర్తించింది ఈయనే
కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణదేశమంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనపాఠి.

శృంగారశ్రీనాథం
క్రీడాభిరామం
బసవపురాణం
రంగనాథ రామాయణం
తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర
ప్రాచీనాంధ్ర శాసనములు
శాతవాహనులు
ఇక్ష్వాకులు
రెడ్డిరాజులు
చాటుపద్యమణిమంజరి
ఇవన్నీ, ఈరోజు మనకందుబాటులో ఉండటానికి ముఖ్యకారకుడు ఈ మహానుభావుడే!
పిన్నవయసు శతావధాని,
‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు, ‘
కడుపు తీపు’,
‘దివ్యదర్శనం’,
‘మూణ్ణాళ్ల మచ్చట’,
‘కపోతకథ’ వంటి ఖండకావ్యాలను రచించారు.
భాసుడి నాటకాలను ఆంధ్రీకరించారు.
మను చరిత్ర మొదలైన కావ్యాలకు వ్యాఖ్యానం రాశారు. చరిత్ర గ్రంథాలు రాశారు. ఎన్నో గ్రంథాలకు పరిష్కారాలు రచించారు.
కుల మతాల బేధాలు ఎరుగని శాస్త్రిగారు మానవత పైనే గురి కలిగినవారు.
ఈయన జీవితాన్ని ఒక వైపు సారస్వతం అయితే మరోవైపు యోగసాధన గా చెప్పుకోవచ్చు. లోక కళ్యాణమే యోగగమ్యమని ఈయన చెప్పేవారు.
శాస్త్రి గారి యోగ శిష్యులలో శ్రీ కొత్త రామ కోటయ్య గారు ప్రముఖులు. కరుణ ,సానుభూతి ,అనుతాపం, శాస్త్రి గారికి ప్రాణం ధాతువులని ఆయన శిష్యులు చెప్పుకునేవారు.
కులమతాలకతీతంగా ఈయన ఎంతోమంది విద్యార్థులను ఆదరించారు. శాస్త్రి గారి ఇంట్లో ఉండి చదువుకున్న ఎంతో మంది హరిజన ,ముస్లిం విద్యార్థులు   ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు.
శాస్త్రిగారు సంస్కృత రూపకాలను అనేకం తెలుగులోకి అనువాదం చేశారు. ఈయనకు వేటూరి ఆనందమూర్తి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ప్రఖ్యాత సినీగీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి వీరి తమ్ముని కుమారుడు.
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గొప్ప వక్త మానవతావాది మహా మనిషి ,స్థితప్రజ్ఞుడు. ఆయన పరిశీలించిన ఏ గ్రంథమైనా ,శాసనమైనా, తాళపత్రమైనా ప్రామాణికత సత్యనిష్ఠలే ఆయన కొలమానం.
జీవితంలో ఆద్యంతం ఉత్తమ విలువలకు స్థానం ఇచ్చిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఆగస్టు 29 1950న అందరినీ విడిచి దూరమయ్యారు.

situs slot gacorslot88