వ్యవహార భాష ఉద్యమానికి తొలి అడుగు
గ్రాంధిక భాష పై పడ్డ పిడుగు
మన జాతికి దక్కిన తెలుగు వెలుగు
మన గిడుగు.
తెలుగు జాతి ఉన్నంత కాలం గుర్తుంచుకోదగిన జీవనది గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు.
శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1969 ఆగస్టు 29న రామ్మూర్తి గారు జన్మించారు. ఈయన ధారణ అసాధారణమైనది.
ఈయన మూఢనమ్మకాలను విశ్వసించేవాడు కాదు. నిర్మొహమాటం ఖచ్చితత్వం రామ్మూర్తి గారి వ్యక్తిత్వ లక్షణాలు.
పది సంవత్సరాల వయసులోనే అన్నపూర్ణమ్మతో వివాహం అయింది.
చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా తల్లి ప్రోత్సాహంతో ఎఫ్.ఎ వరకు చదువుకున్నారు. పర్లాకిమిడి రాజావారి ఆస్థానంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప సంఘటన అది. పర్లాకిమిడి రాజావారి ఆస్థానంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న "సవర" ప్రజలతో ఆయనకు పరిచయం ఏర్పడింది . వారి భాష నేర్చుకున్నాడు.
ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవర ల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది.
సవర" దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి.
లిపిలేని సవర భాషకు లిపిని సృష్టించాడు
తన జీవిత సర్వస్వాన్ని సవర భాష కోసం త్యాగం చేశాడు. సవర భాషకు నిఘంటువు నిఘంటువు రూపొందించాడు.
సవరభాషలో పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు.
మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931 లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938 లోను అచ్చువేశారు. 1934 లో ప్రభుత్వం అతనికి 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది.
1934 లో ప్రభుత్వం కైజర్ ఎ హింద్ బిరుదు ఇచ్చి గౌరవించింది.
1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది.
అంతేకాదు తెలుగులో మాట్లాడే భాషకు రాసే భాషకు మధ్య ఉన్న అంతరాన్ని చెరివేయాలనుకున్నాడు.. వ్యవహారిక భాష ఉద్యమానికి ఇచ్చాడు.
1919 లో గిడుగు "తెలుగు" అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు
అందుకే గిడుగు వారి "వ్యవహారిక భాష ఉద్యమ ప్రవక్త" గా పిలుస్తారు. వ్యవహారిక భాష ఉద్యమాన్ని ఎంతో మంది పండితులు అడ్డుకున్నారు.
అయినప్పటికీ చివరకు గిడుగు రామ్మూర్తి పంతులు విజయం సాధించారు. పండితులంతా వ్యవహార భాషా ఉద్యమాన్ని ఆమోదించారు .ప్రజల భాషలోనే గ్రంథ రచనకు పూనుకున్నారు.
ఈరోజు పత్రికలు ప్రజలు అందరూ తమకు నచ్చిన సరళ భాషలో రాయ గలుగుతున్నారంటే అందుకు మొట్టమొదటి అంకురార్పణ చేసిన మహా వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు.
గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. క్రమక్రమంగా అది దినదినాభివృద్ధి చెంది విశ్వవిద్యాలయాల్లో సిద్ధాంత గ్రంథాలు సహితం వ్యవహారిక భాషలోనే సమర్పించే స్థాయికి చేరాయి. ఈ రోజు మనకు నచ్చిన అభిప్రాయాన్ని సరళ భాషలో వ్యక్తీకరించే గొప్ప అవకాశం కల్పించిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారే